తెలంగాణ

telangana

ETV Bharat / city

అనుమాములలో కోదండరాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం - నల్గొండలో తెజస ప్రెస్​మీట్

వరంగల్​, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా అనుముల మండలకేంద్రంలో తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రచారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టభద్రులు తప్పకుండా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

tjs kodandaram pressmeet on graduate mlxc elections in  nalgonda
అనుమాములలో కోదండరాం పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

By

Published : Oct 31, 2020, 5:34 PM IST

నల్గొండ జిల్లా అనుముల మండలకేంద్రంలో తెజస అధ్యక్షుడు కోదండరాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని కోదండరాం అన్నారు.

ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు తీవ్ర పంటనష్టం జరిగితే ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తడిసిన ధాన్యం, పత్తి పంటలకు మద్దతు ధరలను అందించడంలో రైతులకు సర్కారు అన్యాయం చేస్తోందని కోదండరాం ఆరోపించారు. పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులు తప్పక వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:ఈసారి ధాన్యం అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు: మంత్రి సత్యవతి

ABOUT THE AUTHOR

...view details