ఒకనాటి యాదగిరి‘గుట్ట’ కొత్త రూపు సంతరించుకుంది.. గిరి ప్రదక్షిణకు ప్రత్యేక రహదారి.. కాటేజీలు, ప్రెసిడెన్షియల్ సూట్లు.. ఒకటని కాదు ఎన్నెన్నో ఏర్పాట్లు. వీటితోపాటు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్తగా విశాల భవనంలో ఏర్పాటు చేసిన స్వామి వారి ప్రసాదాల తయారీ కేంద్రాన్ని నేడు ప్రారంభించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయముకు మహాకుంభ సంప్రోక్షణ పర్వం పూర్తి చేసి ఆలయంలో భక్తులకు స్వయంభు దర్శనాల అనుమతి చేపట్టారు. ఆరేళ్ల తరువాత భక్తులకు ప్రధాన ఆలయ ప్రవేశం చేపట్టారు.
Yadadri Temple News: యాదాాద్రిలో ఆ కేంద్రాలు నేటి నుంచి ప్రారంభం
Yadadri Temple News: ఆధ్మాత్మిక నగరిగా యాదాద్రి కొత్త రూపం సంతరించుకుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయముకు మహాకుంభ సంప్రోక్షణ పర్వం పూర్తి చేసి ఆలయంలో భక్తులకు 3 రోజుల నుంచి స్వయంభు దర్శనాల అనుమతి చేపట్టారు. అదేవిధంగా భక్తుల రద్దీ దృష్ట్యా ప్రసాదాల తయారీకి ఏర్పాటు చేసిన విశాలమైన భవనాన్ని నేడు ప్రారంభించారు.
Yadadri Temple
ఆ తరుణంలోనే భక్తులు దర్శనం అనంతరం.. స్వామివారి లడ్డు, పులిహోర, ప్రసాదాలను ఇష్టంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని అధికారులు, ప్రసాదాల తయారీ కేంద్రానికి మూడు అంతస్థుల భవంతి ఏర్పాటు చేసి.. అందులో విక్రయ కేంద్రాలు నేడు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, కౌంటర్లను ఆలయ అధికారులు ప్రారంభించారు.
ఇదీ చదవండి:ఉగాది మహోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల మహాక్షేత్రం.. ఐదు రోజుల పాటు ఉత్సవాలు