తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బల్క్ ఆర్డర్లలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లడ్డూలు విక్రయించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది. కల్యాణ మండపాల వద్ద చిన్నపాటి స్టాళ్లు ఏర్పాటు చేసి స్వామి వారి ప్రసాదం, లాకెట్, క్యాలెండర్, ఇతర వస్తువుల్ని భక్తులకు విక్రయించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.
కానుకగా యాదాద్రి లడ్డూ ప్రసాదం - yadadri news
తితిదే బాటలో యాదాద్రి స్వామి ప్రసాదం విక్రయానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. అనుమతి రాగానే ఆచరణలో పెట్టనున్నారు.

కానుకగా యాదాద్రి స్వామి వారి ప్రసాదం
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. అనుమతి రాగానే ఆచరణలో పెట్టనున్నారు. పెళ్లిళ్లు, పుట్టిన రోజు, ఇతర శుభకార్యాల్లో స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కానుకగా ఇచ్చేందుకు బల్క్‌లో లడ్డూలు బుక్ చేసుకునేలా ప్రతిపాదించారు
ఇవీ చూడండి: కరోనా దెబ్బతో వృత్తులు చిత్తు