నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాగర్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సజ్జన్ సింగ్ చౌహాన్, పోలీసు పరిశీలకులు సునీల్ కుమార్ మీనన్ పర్యటించారు.
సాగర్‌లో ఈసీ పర్యటన.. ఓటింగ్ సరళి పరిశీలన - ec shashank goyal visited nagarjuna sagar
నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాగర్‌లో పర్యటించిన ఈసీ శశాంక్ గోయల్.. పైలాన్, హిల్కాలనీల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు.
![సాగర్‌లో ఈసీ పర్యటన.. ఓటింగ్ సరళి పరిశీలన ec shashank goyal, telangana ec shashank, nagarjuna sagar by election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11436184-475-11436184-1618647307960.jpg)
నాగార్జునసాగర్ ఉపఎన్నిక, తెలంగాణ ఈసీ, ఈసీ శశాంక్ గోయల్
సాగర్‌లోని పైలాన్, హిల్‌కాలనీలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ఇప్పటివరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని ఈసీ గోయల్ తెలిపారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చదవండి :తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం.. తెదేపా ఆందోళన