యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి తూప్రాన్ నుంచి ఓ వ్యక్తి పాదయాత్ర చేస్తూ వచ్చాడు. నాలుగు రోజులుగా నరసింహ స్వామి వద్దకు నడుచుకుంటూ వస్తున్న సిందే చంద్రం ఈ రోజు స్వామి వారి చెంతకు చేరుకొని దర్శించుకున్నాడు. ఎమ్మెల్యే హరీశ్ రావుకి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ గత కొద్ది కాలం క్రితం దీక్ష ద్వారా స్వామివారిని మొక్కుకున్నాడు. దేవుడి కృప వల్ల హరీష్ రావుకి మంత్రి పదవి రావడం ఆనందంగా ఉందని సిందే చంద్రం తెలిపారు. స్థానిక తెరాస కార్యకర్తలు... సిందే చంద్రంకు ఘనస్వాగతం పలికారు.
హరీశ్ రావుకు మంత్రి పదవి... కాలినడకన యాదాద్రికి చంద్రం - నల్గొండలో 'స్వచ్ఛత హి సేవ' అవగాహన ర్యాలీ
ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రి పదవి రావాలని... అలా వస్తే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నడిచి వస్తానని మొక్కుకున్నాడు తూప్రాన్కి చెందిన ఓ వ్యక్తి. మొక్కు ప్రకారం ఈ రోజు ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నాడు.
హరీశ్ రావుకు మంత్రి పదవి... కాలినడకన యాదాద్రికి చంద్రం
Last Updated : Oct 2, 2019, 7:57 PM IST