తెలంగాణ

telangana

ETV Bharat / city

రెడ్​జోన్​గా సూర్యాపేట జిల్లా కేంద్రం!

సూర్యాపేట జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. జిల్లా కేంద్రంలో నిన్న ఒక్క రోజే 8 కేసులు నమోదవ్వగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్​డౌన్ ఆంక్షలు కఠినతరం చేయడమే కాకుండా ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీ పర్యటించి స్వయంగా నివారణ చర్యలను పర్యవేక్షించారు.

-red-zone
రెడ్​జోన్

By

Published : Apr 12, 2020, 7:31 PM IST

సూర్యాపేట జిల్లాలో కరోనా కోరలు చాస్తుంది. వారం వ్యవధిలోనే జిల్లాలో కేసుల సంఖ్య 20కి చేరింది. నిన్న ఒక్క రోజే 8 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు, వర్ధమానుకోట, తిరుమలగిరి, నేరేడుచర్లలో కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలన్నింటిని హాట్​స్పాట్​లుగా అధికారులు ప్రకటించారు .

రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోన్న కారణంగా జిల్లా కేంద్రంలో లాక్​డౌన్​ను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు పట్టణంలోని 15 వార్డులే రెడ్​జోన్ పరిధిలో ఉండగా.. తాజా కేసులతో జిల్లా కేంద్రం మొత్తాన్ని రెడ్​జోన్ పరిధిలోకి తెచ్చేందుకు కలెక్టర్, ఎస్పీ ప్రణాళికలు సిద్ధం చేశారు.

కూరగాయల మార్కెట్ బజార్, కొత్త బస్​స్టాండ్​, శంకర్ విలాస్ ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ నిత్యవసరాలకు ఎవ్వరూ బయటకి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటి వద్దకే నిత్యావసరాలు చేరవేసేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.

రెడ్​జోన్​గా సూర్యాపేట జిల్లా కేంద్రం!

ఇవీ చూడండి:'మరో 2 రోజుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి'

ABOUT THE AUTHOR

...view details