Munugode by poll news: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ నవంబరు 3వ తేదీన జరగనున్నది. రేపటితో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంది. నామినేషన్లఉపసంహరణ తేదీ ముగిసిన అనంతరం ప్రధాన పార్టీల నాయకులు ప్రచారానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తమ పార్టేదే గెలుపు అనే ధ్యేయంతో పోలింగ్ పూర్తయ్యేంత వరకు నియోజక వర్గం నుంచి విడిచివెళ్లేదే లేదన్నట్టుగా వసతి గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అద్దెకు వసతి గృహాలు కొరత ఏర్పడంతో ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు ఏర్పాటు చేశారు.
మునుగోడులో నేతల వసతి కోసం గుడారాలు - మునుగోడు వార్తలు
Munugode by poll news: ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడులో గుడారాలు వెలిశాయి. ప్రధాన పార్టీల నేతలందరూ ప్రచారం కోసం నియోజకవర్గ బాటపట్టడంతో వసతి కోసం వీటిని ఏర్పాటుచేశారు. అద్దె ఇళ్లు దొరకకపోవడంతో గుడారాలను సిద్ధం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రచారం మరింత ఊపందుకొనే అవకాశం ఉండటంతో గుడారాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
![మునుగోడులో నేతల వసతి కోసం గుడారాలు Setting up tents for campaigning](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16631976-879-16631976-1665644514684.jpg)
ప్రచారానికి గుడారాల ఏర్పాటు
మునుగోడులో నేతల వసతి కోసం గుడారాలు
భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ప్రచారానికి తమ పార్టీ నాయకులకు, ముఖ్య అతిథులకు, కార్యకర్తలకు వసతుల కోసం కోటి రూపాయల వ్యయంతో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ప్రచార జోరు మరింత ఊపందుకొనే అవకాశం ఉండటంతో వసతికి కావలసిన గుడారాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
Last Updated : Oct 13, 2022, 3:45 PM IST