యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా కొండపై చేపట్టిన పనులను మరింత వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సాంకేతిక కమిటీ సభ్యులు యాడ అధికారులు ఆర్అండ్బీ అధికారులు ఇటీవల ఆలయ పనులను సందర్శించి పలు సూచనలు చేశారు.
మరింత వేగంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఉత్తర దిశలో రక్షణ గోడ నిర్మాణం పనులు, మెట్లదారి నిర్మాణం పనులు ఊపందుకున్నాయి.
మరింత వేగంగా ఆలయ పునర్నిర్మాణ పనులు
కొండపై ఆలయ పుష్కరిణి పునరుద్ధరణ పనులతోపాటు మాడ వీధుల్లో ఫ్లోరింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్తర దిశలో రక్షణ గోడ నిర్మాణం పనులు, మెట్లదారి నిర్మాణం పనులు ఊపందుకున్నాయి.
ఇవీ చూడండి:యాదాద్రి బాలాలయంలో ఆండాళ్ అమ్మవారికి ఘనంగా ఊంజల్ సేవ