'మర్డర్' చిత్రం విడుదలను అడ్డుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అమృత పిటిషన్‌పై నల్గొండ జిల్లా కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఈ సినిమాలో తనను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణపై ఆమె వ్యాజ్యం దాఖలు చేశారు. ఇవాళ్టి విచారణకు దర్శకనిర్మాతలు హాజరుకావలసి ఉన్నా.. వారి తరఫు న్యాయవాది కోర్టును గడువు కోరారు. అనుమతించిన న్యాయస్థానం విచారణను ఈనెల 11కు కోర్టు వాయిదా వేసింది.
మర్డర్ చిత్రంపై నల్గొండ కోర్టులో వాదనలు.. రాంగోపాల్ వర్మ గైర్హాజరు - murder case hearings in nalgonda court
'మర్డర్' చిత్రం విడుదలను అడ్డుకోవాలంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అమృత వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరిగింది. దర్శన నిర్మాతలు రాంగోపాల్‌వర్మ, నట్టి కరణ గైర్హాజరుతో విచారణను ఈనెల 11కు నల్గొండ జిల్లా కోర్డు వాయిదా వేసింది.

మర్డర్ చిత్రంపై నల్గొండ కోర్టులో వాదనలు.. రాంగోపాల్ వర్మ గైర్హాజరు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ఆధారంగా తీసుకొని మర్డర్ పేరుతో దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీశారు. అయితే ఈ కథ తమను కించపరిచేలా ఉందని, చిత్రం విడుదలను అడ్డుకోవాలని నల్గొండ కోర్టులో ప్రణయ్ భార్య అమృత పిటిషన్ దాఖలు చేశారు.
మర్డర్ చిత్రంపై నల్గొండ కోర్టులో వాదనలు.. రాంగోపాల్ వర్మ గైర్హాజరు
TAGGED:
ramgopal varma murder movie