తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రణయ్ హత్య కేసు విచారణ 23కు వాయిదా - మారుతీరావు అంత్యక్రియలు

ప్రణయ్‌ హత్య కేసు విచారణను నల్గొండ న్యాయస్థానం ఈ నెల 23కు వాయిదా వేసింది. మారుతీరావు అంత్యక్రియల నేపథ్యంలో శ్రవణ్‌ కోర్టుకు హాజరుకాలేరని అతని తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సీఆర్పీసీ సెక్షన్‌ 317 కింద... శ్రవణ్‌కు ఈ విడతకు ఉపశమనం లభించింది.

ప్రణయ్ హత్య కేసు విచారణ 23కు వాయిదా
ప్రణయ్ హత్య కేసు విచారణ 23కు వాయిదా

By

Published : Mar 10, 2020, 1:18 PM IST

ప్రణయ్ హత్య కేసు విచారణ... ఈ నెల 23కు వాయిదా పడింది. కేసును వాయిదా వేస్తూ నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడైన ఏ1 మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలియజేశారు.

సోదరుడి చితికి నిప్పంటించినందున.. హిందూ సంప్రదాయం ప్రకారం బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మారుతీరావు తమ్ముడు శ్రవణ్‌ విచారణకు హాజరయ్యే అవకాశం లేదని తెలిపారు. శ్రవణ్​కు మినహాయింపునివ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సీఆర్పీసీ 317 సెక్షన్ ప్రకారం.. శ్రవణ్‌కు ఈ విడతకు కోర్టు హాజరు నుంచి ఉపశమనం లభించింది. వీటన్నింటి దృష్ట్యా న్యాయస్థానం కేసును ఈ నెల 23కు వాయిదా వేసింది.

ప్రణయ్ హత్య కేసు విచారణ 23కు వాయిదా

ఇవీ చూడండి:కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details