కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల రైతు విధానాలను నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. పీసీసీఅధ్యక్షుడు, స్థానికఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో భారీ ఎత్తుల కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడించేందుకు యత్నించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నల్గొండలో కాంగ్రెస్ ధర్నా భగ్నం.. పలువురు నేతలు అరెస్ట్ - నల్గొండ కాంగ్రెస్ తాజా వార్తలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు విధానాలను నిరసిస్తూ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాను... పోలీసులు భగ్నం చేశారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ హస్తం నేతలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కాంగ్రెస్ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.
భారీవర్షాలతో నల్గొండ జిల్లాలోవరి, పత్తి పంటలకి పెద్దయెత్తున నష్టం వాటిల్లిందని...పంటలన్నింటినిప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాడ్ చేశారు. ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు... దుబ్బాక నర్సింహారెడ్డితోపాటు శంకర్‌నాయక్, కొండేటి మల్లయ్య, గుమ్మల మోహన్‌రెడ్డి, పున్న కైలాష్, సైదులు గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలందరిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్లోనూ ప్లకార్డులతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి.
ఇవీ చూడండి:గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు..