నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో నిర్మిస్తున్న కిష్టారాయిన్పల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న లక్ష్మణపురంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పర్యటించారు. నిర్వాసితులను కలిసి.. వారి సమస్యలను అడిగి తెలుసుకన్నారు. ప్రాజెక్టు మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా నేటికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించలేదంటూ గ్రామస్థులు తల్లోజుతో వాపోయారు.
లక్ష్మణపురంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు పర్యటన - కిష్టారాయిన్పల్లి ప్రాజెక్టు నిర్వాసితులను పరామర్శించిన తల్లోజు ఆచారి
కిష్టారాయిన్పల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్నామని.. సంబంధిత అధికారులతో మాట్లాడి తమ సమస్య పరిష్కరించాలని నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని లక్ష్మణపురం గ్రామ వాసులు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారిని కోరారు.

భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఆచారి డిమాండ్
ప్రాజెక్టు శంకుస్థాపన రోజు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని వారి గోడును వెల్లబుచ్చుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ గ్రామం మొత్తం పోతున్నా.. తమను ఏమాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని తల్లోజుతో తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తొందరగా.. నిర్వాసితులకు న్యాయం చేస్తామని తల్లోజు ఆచారి గ్రామస్థులకు హామీ ఇచ్చారు.