పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది... నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి. ఇప్పుడది... బోధనాసుపత్రి కూడా. మండల స్థాయి ఆసుపత్రుల్లో కూడా సకల సౌకర్యాలతో సేవలందిస్తున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. కానీ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనే... అరకొర వసతులతో రోగులు, సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో తాగునీటి గోస
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులు రెండు రోజులుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి ఆవరణలోని నీటి ప్లాంట్ తెరవకపోవడం వల్ల అవస్థలు పడుతున్నారు.
తాగునీటి కోసం రెండు రోజులుగా పడిగాపులు..
ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంటు తెరవక రెండు రోజులు అవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటిమాటికి బయటికి వెళ్లి నీళ్లు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనాతో భయం గుప్పిట్లో బతుకుతుంటే... ఆసుపత్రిలో వసతులు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి:పెళ్లికి నిరాకరించిందని యువతిపై యువకుడు దాడి