నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తరఫున వెలసిన ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలపై... విపక్ష పార్టీలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ... తెరాస జెండాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. నామపత్రాలు సమర్పించిన వామపక్షాల నేతలు... రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు అధికార పార్టీ తీరును వివరించారు.
వివాదంగా మారిన పల్లా ఫ్లెక్సీలు... తొలగించే పనిలో అధికారులు - palla rajeshwar reddy flexies in nalgonda
నల్గొండ పట్టణంలో వెలసిన ఫెక్సీలు, జెండాలపై వివాదం నెలకొంది. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్ వేసే క్రమంలో వెలసిన పార్టీ తోరణాలపై విపక్షాలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాయి. స్పందించిన అధికారులు... వాటిని తొలగించే పనిలో పడ్డారు.
palla rajeshwar reddy flexies gone controversial in nalgonda
భాజపా తరఫున నల్గొండ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి సైతం... తోరణాల తీరును నిరసిస్తూ ఆర్వోను కలిశారు. భారీ ర్యాలీగా మంత్రులతో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా... నల్గొండలో ఇప్పటికే పెద్దయెత్తున ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. స్పందించిన అధికారులు... వాటిని తొలగించే పనిలో పడ్డారు.