ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ పీఆర్సీ ఇచ్చింది తెరాస ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలకబూనిన ఉద్యోగులు, కోపగించిన ఉపాధ్యాయులు అందరూ శాంతించారని తెలిపారు. తెరాసను నమ్మి ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
'వచ్చే నెల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కొత్త పథకం' - telangana graduate mlc elections
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యోగ కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పల్లా పాల్గొన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
వచ్చే నెల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కొత్త పథకం
ఐటీఐఆర్ వస్తే లక్షల ఉద్యోగులు వచ్చేవని పల్లా అభిప్రాయపడ్డారు. పోలీసు ఉద్యోగాల్లో ఇప్పటివరకు 25 శాతం నల్గొండ జిల్లా వాసులే ఉన్నారని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కొత్త పథకం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. సీఎంతో భేటీ తర్వాత ఉద్యోగ సంఘాలు సానుకూలంగా ఉన్నాయని పల్లా వెల్లడించారు.
Last Updated : Mar 10, 2021, 1:53 PM IST