labors Stuck in Flood: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం, కొత్తపల్లి గ్రామాల మధ్య పాలేరు వాగులో చిక్కుకున్న కూలీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నిన్న.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగులో 23 మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. భద్రాచలం నుంచి ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం... రాత్రి కావడం, వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
వాగులో చిక్కుకున్న 23మంది కూలీలు.. ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్ఎఫ్.. - వ్యవసాయ కూలీలను ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్ఎఫ్
labors Stuck in Flood: వ్యవసాయ పనుల కోసం వాగు దాటి వెళ్లిన 23 మంది కూలీలు ప్రవాహం ఉద్ధృతంగా రావడంతో అక్కడే చిక్కుకుపోయారు. అధికారుల సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వారిని రక్షించి ఒడ్డుకు చేర్చింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పాలేరు వాగు వద్ద చోటుచేసుకుంది. ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న కూలీలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Labours Stuck in Flood
బోటు సాయంతో బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ప్రయత్నించినా వీలుపడలేదు. దీంతో డ్రోన్ సాయంతో బాధితులకు ఆహారాన్ని అందజేశారు. ఉదయం 6 గంటలకు బోటు సహాయంతో వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం.. బాధితులకు లైఫ్ జాకెట్లు అందజేసి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఎంతో కష్టపడి బయటకు తీసుకువచ్చిన సహాయక బృందాలకు కూలీలు ధన్యవాదాలు తెలిపారు.