యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని పరమేశ్వరుని ఆలయాన్ని సంప్రదాయ హంగులతో తీర్చిదిద్దేందుకు యాడా నడుంబిగిస్తోంది. యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించినప్పుడు నందీశ్వరుని రాతి విగ్రహాన్ని ఆలయం ఎదుట మెట్లదారిలో ఏర్పాటు చేయాలని స్థపతికి సూచించినట్లు తెలిసింది. శివాలయం లోపల ప్రతిష్ఠించేందుకు మహాబలిపురం నుంచి నంది విగ్రహాన్ని తెప్పించారు. సదరు విగ్రహం పెద్దగా ఉందంటూ మార్పులు- చేర్పుల్లో భాగంగా నంది రూపాన్ని మెట్ల దారిలో ఏర్పాటు చేయనున్నారు.
యాదాద్రిలో మెట్లదారిలో ఐదున్నర అడుగుల నందీశ్వరుని విగ్రహం - యాదాద్రిలో సీఎం కేసీఆర్ సూచనలు వార్లలు
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పరమేశ్వరుని ఆలయానికి మరిన్ని హంగులు దిద్దేందుకు యాడా అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. సీఎం సందర్శనలో భాగంగా చేసిన సూచనలను పాటిస్తూ ఆలయం ఎదుట మెట్లదారిలో నందీశ్వరుని రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
యాదాద్రిలో మెట్లదారిలో ఐదున్నర అడుగుల నందీశ్వరుని విగ్రహం
సీఎం సలహాతో సత్యస్థల పరిశీలనపై యాడా అధికారులు దృష్టి పెట్టారు. ఐదున్నర అడుగుల నల్లరాతి విగ్రహాన్ని భక్తులు సందర్శించేందుకు వీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. మెట్లెక్కి దిగే భక్తులకు ఆయాసం కలగకుండా ఉండేందుకు... ఆ క్రమంలో పూల మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. సేదతీరేందుకు దారిలో బెంచీలను ఏర్పాటు చేయనున్నారు. కొండపైన ఆలయానికి చేరే ప్రాంగణంలో పాదచారుల కోసం అండర్పాస్ ఇప్పటికే నిర్మించారు.