తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2022, 5:37 PM IST

Updated : Jan 6, 2022, 7:12 PM IST

ETV Bharat / city

12 మంది బాలికలపై అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు

nalgonda court on rape accused
nalgonda court on rape accused

17:34 January 06

12 మంది బాలికలపై అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు

12 మంది బాలికలపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముగ్గురు దోషులకు శిక్షలు విధిస్తూ జిల్లా పోక్సో కోర్టు తీర్పు వెల్లడించింది. నల్గొండ జిల్లాలో 2014లో ఓ స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో అత్యాచారం చేసిన ఇద్దరు, సహకరించిన నిర్వాహకులకు కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఏ-1 రమావత్ హరీశ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా, ఏ-2 శ్రీనివాసరావుకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా, ఏ-3 సరితకు 6నెలల జైలు శిక్ష జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది.

మూడు నెలలపాటు 12 మంది బాలికలపై అత్యాచారం..

2014లో నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఏనమీది తండాలో ఈ దారుణం జరిగింది. వీలేజ్​ రీకన్ట్రక్షన్​ ఆర్గనైజేషన్​ స్వచ్ఛంద సంస్థలో చదువుతున్న 12 మంది మైనర్లపై ట్యూటర్​ అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు నెలలుగా ట్యూటర్​ హరీశ్​... అత్యాచారం చేసినట్లు ఓ బాలిక ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన నాటికి బాలికల వయస్సు 11 ఏళ్లు. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. హెచ్​ఆర్​సీలో పిటిషన్ కూడా దాఖలైంది.

నాటి ముఖ్యమంత్రి కిరణ్​కుమార్​రెడ్డి.. బాలికలపై అత్యాచార ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా దారుణం జరుగుతుంటే... ఎందుకు గుర్తించలేకపోయారని మండిపడ్డారు. సత్వర విచారణకు ఆదేశాలు జారీచేశారు. ప్రజా సంఘాలు, గిరిజన, మహిశ సంఘాలు నాడు రోడ్డెక్కాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశాయి.

ఇదీచూడండి:వివాహేతర సంబంధం: ట్రాక్టర్‌తో ఢీకొట్టి.. దమ్ము చక్రాలతో తొక్కించాడు!

Last Updated : Jan 6, 2022, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details