Nagarjuna Sagar lifted 22 gates: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువన నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు 22 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. దిగువ ప్రాంతన ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఎగువ నుంచి 3.94 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో జలాశయం మెుత్తం 22 గేట్లలో 18 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తారు.మరో 4గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3 లక్షల 48వేల క్యూసెక్కుల నీరు స్పిల్ వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ లో ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 33 వేల క్యూసెక్కుల నీటిని, కుడి కాల్వకు 9వేల క్యూసెక్కుల వరద నీటిని, సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడం లేదు. మొత్తంగా సాగర్ జలాశయం నుంచి ఔట్ ఫ్లో గా 3.94 లక్షల క్యూసెక్కుల నీరు వెళుతుంది.