నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల్లో.... స్థానిక సంస్థల ప్రజాప్రతినిథులు ఎవరిని ఎన్నుకున్నారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. లెక్కింపు చేపట్టిన రెండు గంటల్లోపే తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం - mlc
రాష్ట్రంలో మూడు జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థలకు ఎంపికయ్యేదెవరనేది కాసేపట్లో తేలనుంది.
నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు