నల్గొండ జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పెద్దచెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లలను వదిలారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మూడు రకాలకు చెందిన లక్షన్నర చేపపిల్లలను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతో కలిసి చెరువులోకి మంత్రి విడుదల చేశారు.
లక్షన్నర చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి తలసాని - చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి తలసాని
తిరుమలగిరి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో మంత్రి తలసాని... ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతో కలిసి లక్షన్నర చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం పశువులకు కృత్రిమ గర్భధారణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
లక్షన్నర చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి తలసాని
కుల వృత్తులను అభివృద్ధి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని మంత్రి తెలిపారు. మత్స్యకారులను ఆదుకోవడంలో సీఎం ముందున్నారని... మత్స్య కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలతో సొసైటీలను ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ మత్స్య సంపద ఇతర రాష్ట్రాల కన్నా ముందంజలో ఉందని వెల్లడించారు. అనంతరం పశువులకు కృత్రిమ గర్భధారణ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఇదీ చూడండి:బంగాల్లో రెండు చోట్ల భూప్రకంపనలు