Minister Jagdish Reddy mass warning: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. చౌటుప్పల్ సహకార సంఘం కార్యాలయం వద్ద నిర్మించనున్న గోదాముకు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేంద్రం తీరును ఎండగట్టారు.దీంతో కార్యక్రమంలో ఉన్న పలువురు పీఏసీఎస్ డైరెక్టర్లు వారించారు. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడొద్దంటూ ఆందోళనకు దిగారు.
దమ్ముంటే రండి చూసుకుందాం.. భాజపా నేతలకు జగదీశ్ రెడ్డి వార్నింగ్.. - భాజపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి
Minister Jagdish Reddy mass warning: చౌటుప్పల్‌లో జరిగిన శంకుస్థాపన సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి భాజపా నాయకులపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ సర్కార్ చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. దమ్ముంటే రండి చూసుకుందామని వార్నింగ్ ఇచ్చారు.
దీంతో ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మైక్ తీసుకోని భాజపా డైరెక్టర్లపై విరుచుకుపడ్డారు. రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి మాట్లాడితే తప్పేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మోదీ నిలువునా మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఇక్కడ సహకార సంఘానికి శుభాకాంక్షలు చెప్పి వెళ్దాము అనుకున్నాను కానీ భాజపాకి సంబంధించిన వాళ్లు ఇలా సభలో అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. దమ్ముంటే రండి చూసుకుందామని తనదైన రీతిలో వార్నింగ్ ఇచ్చారు.
ఇవీ చదవండి: