నల్గొండలో నిర్వహించిన తెరాస 20వ ఆవిర్భావ వేడుకలకు మంత్రి జగదీశ్ రెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. తక్కువ కాలంలోనే ఎన్నో విజయాలు, అద్భుతమైన పలితాలు సాంధించినట్టు మంత్రి పేర్కొన్నారు. నవ సమాజ నిర్మాణానికి కేసీఆర్ నాయకత్వంలో పునాది పడిందన్నారు. 120 ఏళ్లలో చేయలేని పనులు అనతి కాలంలోనే చేసి చూపించినట్టు తెలిపారు.
'తెరాసను లెక్కచేయలే.. కేసీఆర్ను హేళన చేసిన్రు' - నల్గొండలో జెండా ఆవిష్కరించిన జగదీశ్ రెడ్డి
తెరాస ఆవిర్భావ వేడుకలు నల్గొండలో ఘనంగా నిర్వహించారు. మంత్రి జగదీశ్ రెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. 120 ఏళ్లలో చేయలేని పనులు తెరాస అనతి కాలంలోనే చేసి చూపిందని మంత్రి పేర్కొన్నారు.
'తెరాసను లెక్కచేయలే.. కేసీఆర్ను హేళన చేసిన్రు'
జలదృశ్యంలో తెరాస పురుడు పోసుకున్న రోజు... ఎవరూ లెక్క చేయలేదు. కేసీఆర్ దగ్గర ఏంముందని హేళన చేశారు. ప్రపంచాన్ని మాయ చేస్తామనే అహంకారం ఉన్నవాళ్లు కేసీఆర్ను నలిపేస్తామన్నారు. ఎవరికేం కావాలో గమనించి పథకాలు ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి. చిరుమర్తి లింగయ్య, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల్లో మెరుగుదల'