Ambedkar film on chalk: రాయడానికి ఉపయోగపడే సుద్దముక్క అతడికి మరో కోణాన్ని చూపించింది. తన సూక్ష్మకళా నైపుణ్యంతో అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని ఓ అభిమాని సుద్దముక్కపై అంబేడ్కర్ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అంబేడ్కర్‌పై అభిమానంతో ఆ చిత్రాన్ని చెక్కినట్లు నరేశ్ చారి తెలిపారు.
సుద్దముక్కపై అంబేడ్కర్ చిత్రం చెక్కి ఔరా అనిపిస్తున్న కళాకారుడు - చాక్‌పీస్‌పై అంబేడ్కర్ చిత్రం
Ambedkar film on chalk: సుద్దముక్కతో సాధారణంగా అందరికీ రాయడమే తెలుసు. అయితే ఓ వ్యక్తి మాత్రం వాటి ద్వారా తన కళా నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాడు. సూర్యాపేటకి చెందిన వ్యక్తి అద్భుత నైపుణ్యంతో సుద్దముక్కపై అంబేడ్కర్ చిత్రాన్ని చెక్కి ఔరా అనిపిస్తున్నాడు.
సుద్దముక్కపై అంబేడ్కర్
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వెంకట్రామపురానికి చెందిన నరేశ్ చారి సూక్ష్మ వస్తువులపై అద్భుత కళాఖండాలను ఆవిష్కరిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. జాతీయ నాయకులు, పక్షులు, జంతువుల చిత్రాలను సూక్ష్మ వస్తువులపై చెక్కుతున్నాడు. అంబేడ్కర్‌పై అభిమానంతో సుద్దముక్కపై చిత్రాన్ని చెక్కినట్లు నరేశ్ తెలిపారు. ప్రభుత్వం సూక్ష్మ కళాకారులకు సహకరిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానని పేర్కొన్నారు.