తెలంగాణ

telangana

'ప్రతి భారత పౌరుడు.. సంతోష్ బాబుని రోల్​ మోడల్​గా తీసుకోవాలి'

By

Published : Jan 17, 2021, 8:00 PM IST

Updated : Jan 17, 2021, 11:28 PM IST

సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హైదరాబాద్​లో ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో కల్నల్ సంతోష్ సతీమణి సంతోషికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. భారత్ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

many-people-have-demanded-that-the-param-veera-chakra-award-be-given-to-colonel-santosh-babu-who-was-killed-in-a-clash-on-the-indo-china-border
'ప్రతి భారత పౌరుడు.. సంతోష్ బాబుని రోల్​ మోడల్​గా తీసుకోవాలి'

భారత్ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు పరమ వీరచక్ర అవార్డు ఇవ్వాలని పలువురు కోరారు. భారత సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆకృతి సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంతోష్ బాబు సేవలను కొనియాడారు.

ధన్యవాదాలు...

ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ట్రైనీ డిప్యుటీ కలెక్టర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి పాల్గొన్నారు. దేశం కోసం తన భర్త చేసిన త్యాగాన్ని గుర్తించి.. తమ కుటుంబాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన భర్త ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి తనవంతు సేవలందిస్తానన్నారు.

స్ఫూర్తిదాయకం...

ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత మాజీ లెఫ్ట్‌నెంట్ జనరల్ కె.రామచంద్రరావు.. సంతోష్ బాబు చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రతి భారత పౌరుడు ఆయనను రోల్ మోడల్​గా తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:పసుపు బోర్డు ఏర్పాటు ఇంకెప్పుడు ? : మానాల మోహన్​రెడ్డి

Last Updated : Jan 17, 2021, 11:28 PM IST

ABOUT THE AUTHOR

...view details