తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ చేసిన మండలి ఛైర్మన్ గుత్తా - నల్గొండలో సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ

నల్గొండలోని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో... లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ చేశారు. సీఎంఆర్​ఎఫ్​ పేదలకు ఓ వరం లాంటిదని వ్యాఖ్యానించారు.

mandali chirmen gutha sukhendar reddy distribution cmrf cheques in nalgonda
సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ చేసిన మండలి ఛైర్మన్ గుత్తా

By

Published : Sep 12, 2020, 5:23 PM IST

అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న 20 మంది లబ్ధిదారులకు... శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించారు. ప్రజా సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వ అద్భుతమైన పథకాలను అమలు చేస్తోందన్నారు.

ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్​ తీవ్రంగా కృషి చేస్తున్నారని గుత్తా అన్నారు. సీఎంఆర్​ఎఫ్​ పేదలకు ఓ వరం లాంటిదని పేర్కొన్నారు. రైతులకు భూ సమస్యలు లేని రాష్ట్రంగా చేయడానికి నూతన చట్టాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, నాయుకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గుత్తా సుఖేందర్​రెడ్డిని కలిసిన టీఎన్జీవో నేతలు

ABOUT THE AUTHOR

...view details