నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 31 శాతం ఓటింగ్ నమోదయింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అనుముల మండలం ఇబ్రహీంపేటలో తెరాస అభ్యర్థి నోముల భగత్.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా అభ్యర్థి రవికుమార్ దంపతులు.. త్రిపురారం మండలం పలుగు తండాలో ఓటు వేశారు.
నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ బూత్ 99లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జానారెడ్డి కోరారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఎన్నికల అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు.
మరోవైపు చింతగూడెంలో తన కుటుంబ సభ్యులతో కలిసి తెదేపా అభ్యర్థి అరుణ్‌కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.