మునుగోడు నియోజకవర్గ తెరాస అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారిపై చౌటుప్పల్‌లో తెరాస పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు భాస్కరరావు, సుదీర్‌రెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, వివేకానంద గౌడ్, డాక్టర్ సంజయ్‌కుమార్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. డ్రోన్‌పై నుంచి గులాబీ పూలు చల్లారు.
నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నికలకు... నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 32 మంది అభ్యర్థులు... 52 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న తెలంగాణ జన సమితి పార్టీ తరఫున పల్లె వినియ్‌కుమార్, బహుజన సమాజ్ పార్టీ నుంచి ఆందోజు శ్రీనివాసచారి... నామపత్రాలు సమర్పించారు.
ఉపఎన్నికల్లో పలువురు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీలో నిలుస్తున్నారు. రైతుపక్షాన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు కోమటిరెడ్డి సాయితేజ్ రెడ్డి చండూర్ బస్టాండ్ నుంచి ఎద్దులబండితో ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారికి నామపత్రం సమర్పించారు. కాసేపట్లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెరాస అభ్యర్థి నామినేషన్ దాఖలుకు కేటీఆర్ హాజరవుతున్నారు. బంగారిగడ్డ నుంచి చండూరు వరకు తెరాస భారీ ర్యాలీ చేపడుతోంది. ఈ ర్యాలీలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల వెంట పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌కు ఘనస్వాగతం.. దారిపొడవునా డ్రోన్లతో గులాబీ పూలు.. ఇప్పటికే భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి భారీ హంగామా నడుమ నామినేషన్ దాఖలు చేశారు. భారీగా తరలివచ్చిన అగ్రనాయకత్వం, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కోమటిరెడ్డి ర్యాలీగా బయలుదేరారు. బంగారి గడ్డ నుంచి ఆర్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కోమటిరెడ్డి వెంట తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, వెంకటస్వామి, మనోహర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు.
ఇవీ చదవండి: