కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం 15, 16 తేదీల్లో నాగార్జున్ సాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది. కేంద్ర జల్‌శక్తి జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా కేఆర్ఎంబీకి స్వాధీనం చేసేందుకు గుర్తించిన అవుట్లెట్లను సబ్‌కమిటీ పరిశీలించనుంది.
నాగార్జునసాగర్‌లో కేఆర్ఎంబీ ఉపసంఘం పర్యటన - KRMB sub committee nagarjuna sagar visit
18:42 November 11
నాగార్జునసాగర్‌లో కేఆర్ఎంబీ ఉపసంఘం పర్యటన
గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్లెట్లను పరిశీలించిన ఉపసంఘం.. తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై నేతృత్వంలోని సబ్‌కమిటీ నాగార్జున సాగర్‌లో పర్యటించనుంది.
ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పంప్‌హౌస్, సాగర్ స్పిల్‌వే, స్లూయిస్, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ హెడ్రెగ్యులేటర్లను ఉపసంఘం పరిశీలించనుంది. రెండో రోజైన 16వ తేదీన సాగర్ ఎడమకాల్వ పవర్ హౌస్, ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటర్, వరద కాల్వ హెడ్‌రెగ్యులేటర్ పరిశీలిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఉపసంఘం సమావేశం నాగార్జునసాగర్‌లో జరగనుంది.
ఇదీచూడండి:Heavy Rains : బీ అలర్ట్.. భారీ వర్షాలు.. చలిగాలులు... ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!