Komatireddy Tweet on GO 246: తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటి కేటాయింపునకు జారీ చేసిన జీవో 246ను వ్యతిరేకిస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది ఏళ్లుగా తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నెల 18న ఈ జీవో జారీ చేశారని.. అది నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
'జీవో 246 వెంటనే రద్దు చేయకపోతే జిల్లా కేంద్రంలో దీక్షకు సిద్దం' - జీవో 246పై వెంకట్‌రెడ్డి ఫైర్
Komatireddy Tweet on GO 246: రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నీటి కేటాయింపునకు జారీ చేసిన జీవో 246ను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వేదికగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలు ఆరోపణలు చేశారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నది నుంచి ఏపీ సీఎం జగన్ 8 నుంచి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోందని విమర్శించారు.
ఎస్‌ఎల్‌బీసీ ద్వారా జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 246ని తెచ్చిందని.. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ట్విటర్లో ఆరోపించారు. కృష్ణా నది నుంచి ఏపీ సీఎం జగన్ 8 నుంచి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జీవో నెంబరు 246ని వెంటనే రద్దు చేయాలని.. లేదంటే జిల్లా కేంద్రంలో దీక్షకు సిద్దమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. జీవో రద్దు చేయాలని సీఎంకి లేఖ రాస్తానని.. అవసరమైతే అపాయింట్‌మెంట్ తీసుకుని కలుస్తానన్నారు. ఎస్‌ఎల్‌బీసీకి 30టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 40, డిండి ఎత్తిపోతలకు 20 టీఎంసీల నీరు కేటాయించాలని వెంకట్‌రెడ్డి ట్విటర్ ద్వారా డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: