కొవిడ్ వంటి కష్టకాలంలోనూ ప్రజా సంక్షేమంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర రావు అన్నారు. ఈ సంక్లిష్ట సమయంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. మొత్తం 94 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
kalyana lakshmi : సంక్లిష్ట సమయంలోనూ.. సంక్షేమమే ధ్యేయం - నల్గొండ జిల్లాలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కరోనా వంటి కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక సర్కార్ తెలంగాణ అని ఎమ్మెల్యే భాస్కర రావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, మిర్యాలగూడ వార్తలు
మరో విడతలో చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కష్టకాలంలోనూ ఆడపిల్లల తండ్రికి అండగా నిలిచినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు.