తెలంగాణ

telangana

ETV Bharat / city

వరద బాధితులకు జానారెడ్డి పరామర్శ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అలుగు దూకి ప్రవహించిన నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని చౌట చెరువులో మునిగిపోయిన కాలనీల బాధితులను మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ నాయకుడు జానారెడ్డి పరామర్శించారు. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

Janareddy Consolation Nidamanuru Floods Victims in nalgonda District
వరద బాధితులను పరామర్శించిన జానారెడ్డి

By

Published : Oct 19, 2020, 4:18 PM IST

నల్గొండ జిల్లా నిడమనూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అలుగు దూకిన చౌట చెరువు ముంపు బాధితులను మాజీ మంత్రి జానారెడ్డి పరామర్శించారు. వరదల వల్ల నిరాశ్రయులైన 40 కుటుంబాల బాధితులకు అండగా ఉంటామన్నారు. వరద తాకిడికి గూడు కోల్పోవడం బాధకరమన్నారు.

నిలువ నీడ లేకుండా పోయిన వారికి ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలన్నారు. రెవెన్యూ అధికారులు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి త్వరితగతిన నష్ట పరిహారం అందేలా చర్యలుతీసుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పటికైనా మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. ఇల్లు కూలిపోయిన బాధితులకు డబుల్​ బెడ్​రూమ్​ మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:రైతుకు సాయం.. యువతకు ఆదాయం!

ABOUT THE AUTHOR

...view details