తెలంగాణ

telangana

ETV Bharat / city

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ఇళ్లలోకి చేరుతున్న వర్షపునీరు.. - సూర్యాపేటలో వర్షం

Rains in Telangana Today: షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జోరువానకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Rains in Telangana
Rains in Telangana

By

Published : Jul 22, 2022, 2:04 PM IST

Rains in Telangana Today: గత మూడ్రోజుల నుంచి శాంతించిన వరణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. షియర్ జోన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షంకురుస్తోంది. హుజూర్‌నగర్, మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి పాలకీడు మండలాల్లో భారీవర్షం పడుతోంది. జోరువానకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. జోరువానకు హుజూర్‌నగర్‌లోని 18, 19వార్డులలో ఇంట్లోకి వర్షపునీరు వచ్చి చేరుతోంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురుగునీరంతా ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ఇళ్లలోకి చేరుతున్న వర్షపునీరు..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details