తెలంగాణ

telangana

ETV Bharat / city

నల్గొండలో భారీ వర్షం... పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు - heavy rains in nalgonda

నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మునుగోడు, చండూరు, మర్రిగూడ మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల వరద ప్రవాహం ఎక్కువై కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

heavy flood water to nalgonds due to rains in the district
నల్గొండలో భారీ వర్షం... పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

By

Published : Sep 21, 2020, 12:50 PM IST

నల్గొండ జిల్లా మునుగోడు, చండూరు, మర్రిగూడ మండలాల్లో భారీ వర్షం కురిసింది. రోజంతా ఎండ కాసి సాయంత్రం ఒక్కసారిగా ఆకాశమంతా మేఘావృతమై పెద్ద ఎత్తున వాన పడి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువలు, కుంటలు నిండి జలకళ సంతరించుకుంటున్నాయి.

జిల్లాలోని పలు చోట్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల కొన్ని గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, పంటపొలాల్లో నీరు చేరి పత్తిపంటలు దెబ్బతిన్నాయంటూ రైతులు వాపోయారు. గ్రామాల్లో పంటనష్టాన్ని సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి.. తమను ఆదుకోవాలని రైతన్నలు కోరారు.

ఇదీ చదవండిఃజిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎక్సైజ్​ అధికారుల తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details