Gutha Sukender Comments on BJP : కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని..కేటాయించే నిధుల్లోనూ కోత పెడుతుందని శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజన హమీలు కేంద్రం గాలికి వదిలేసిందని ఆరోపించారు. 'రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఉత్సవ విగ్రహంలా మారిపోయాడు తప్ప..రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టడం లేదు' అని అన్నారు. కేంద్రం తెలంగాణపై అక్కసు, వ్యత్యాసం చూపెడుతోందని గుత్తా విమర్శించారు.
Gutha Sukender Fires on BJP : ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడితే భాజపా వాళ్లు పెడర్థాలు తీస్తున్నారని.. గతంలో ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని పునః సమీక్షించారని గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తుచేశారు. అంబేడ్కర్ స్పూర్తితోనే రాజ్యాంగంలో పునః సమీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదని తేల్చి చెప్పారు. భాజపాకు దమ్ము ఉంటే బయ్యారం స్టీల్ ప్లాంట్, సాగు నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీని తీసుకురావాలని సవాల్ విసిరారు.