సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో అన్నమయ్య భజన మండలి ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. భజన సంకీర్తనల్లో గెలుపొందిన నగదును నిరుపేద కుటుంబాలకు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
నిరుపేద కుటుంబాలకు నిత్యవసరాల పంపిణీ - నిత్యవసరాల పంపిణీ
భజన సంకీర్తనల్లో గెలుపొందిన నగదుతో నిత్యవసరాలు పంపిణీ చేశారు హుజూర్నగర్ వాసులు. అన్నమయ్య భజన మండలి ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలకు రోజువారి సరుకులను మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు.
నిరుపేద కుటుంబాలకు నిత్యవసరాల పంపిణీ
పట్టణం మొత్తం రసాయనాలను పిచికారి చేశామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పట్టణంలో వలస కూలీలు 609 మంది ఉన్నారని పేర్కొన్నారు. వీరికి 12 కేజీల బియ్యం, రూ.500 రూపాయలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:రేషన్ సరే.. సామాజిక దూరం ఎక్కడ?