యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అద్భుత ఆలయ శిల్పకళా నైపుణ్యంతో పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. సంప్రదాయ హంగులతో.. గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపుల ఉన్న జయ విజయుల మందిరాలకు ఇత్తడితో సిద్ధపరచిన ప్రభల ఏర్పాట్లను చేపట్టారు. మూడున్నర అడుగుల ఎత్తులో రూపొందించిన గ్రిల్స్ తొలుత ప్రధానాలయంలో బిగింపునకు యోచిస్తున్నారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. యాదాద్రి పునరుద్ధరణ పనులు
యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గర్భాలయ ప్రవేశ ద్వారానికి మూడున్నర అడుగుల ఎత్తులో రూపొందించిన గ్రిల్స్ బిగింపునకు యోచిస్తున్నారు.
ఆధ్యాత్మిక ఉట్టిపడేలా..
తూర్పుదిశలో త్రితల రాజగోపురం నుంచి, వరుసలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు పూర్తయ్యాక దర్శనం వరుసల సముదాయం నుంచి మండపం ప్రాకారం ద్వారా గ్రిల్స్ ఏర్పాటు చేపట్టనున్నారు. ప్రధాన ఆలయ ముఖమండపంలోని ఉప ఆలయాలకు సాంప్రదాయ కోసం.. ప్రభల బిగింపునకు ప్రాధికార సంస్థ నిర్వాహకులు స్థపతుతో చర్చిస్తున్నారు.
ఇవీ చూడండి:మరింత వేగంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు