నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు వేకువజామున నుంచే స్వామివారి దర్శనం కోసం బారు తీరారు. శనివారం రోజు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం జరిగ్గా... ఈ రోజు ఉదయం నాలుగున్నరకు అగ్నిగుండాల కార్యక్రమం ఏర్పాటు చేశారు.
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో ఘనంగా అగ్నిగుండాలు - ఘనంగా అగ్నిగుండాల కార్యక్రమం
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో శ్రీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు నిప్పులపై నడుచుకుంటూ... ఉత్సాహంగా పాల్గొన్నారు.
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో ఘనంగా అగ్నిగుండాలు
భక్తులు ఓం నమః శివాయ నామస్మరణతో అగ్నిగుండాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిప్పులపై నడుచుకుంటూ... తమ కోరికలు తీర్చాలని ఆ శివయ్యను వేడుకున్నారు.పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో గుట్టపైన జనసంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ, అధికారులు అన్ని రకాల వసతులు కల్పించారు.
ఇదీ చూడండి:చెట్టుపై చిరుతపులి .. భయాందోళనలో ప్రజలు