జాతిపిత మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలను నల్గొండలో ఘనంగా నిర్వహించారు. రామగిరి సెంటర్లో ఉన్న గాంధీ పార్క్‌లో మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిపారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సాధన కోసం గాంధీజీ చేసిన సేవలను ఎమ్మెల్యే గుర్తుచేశారు.
'మహాత్ముని ఆశయాలు నెరవేర్చేందుకు ప్రజలు పాటుపడాలి' - గాంధీ జయంతి వేడుకలు 2020
నల్గొండ పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్ముని ఆశయాలు నెరవేర్చేందుకు ప్రజలంతా పాటుపడాలని కోరారు.
gandhi jayanti birthday celebrations in nalgonda
మహాత్ముని ఆశయాలను సాధించేందుకు ప్రజలు పాటుపడాలని సూచించారు. స్వచ్ఛభారత్ విషయంలో భారతదేశంలోనే తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. పరిశుభ్రత కోసం సీఎం కేసీఆర్... గ్రామాలకు, పట్టణాలకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.