మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్... ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి... సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్ కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ప్రకటించారు.
RS PRAVEEN KUMAR: నల్గొండ సభలో బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ - ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వార్తలు
ఇటీవలే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) కండువా కప్పుకున్నారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీలో చేరారు. ఐపీఎస్‌కు రాజీనామా అనంతరం.. పూలే, అంబేడ్కర్, కాన్షీరాం బాటలోనే పోరాటం చేస్తానని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు.
RS PRAVEEN KUMAR
మర్రిగూడ బైపాస్ వద్ద అంబేడ్కర్, జగ్జీవన్ విగ్రహాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి సభాస్థలికి చేరుకున్నారు. స్వేరో ప్రతినిధులు, బీఎస్పీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదీచూడండి:RS PRAVEEN KUMAR: నేను హిందువునే... మాతమార్పిడులు అవాస్తవం... అందుకే రాజీనామా చేశా?
Last Updated : Aug 8, 2021, 9:32 PM IST