సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆబ్కారీ పోలీసులు దాడులు చేశారు. 300 లీటర్ల బెల్లం పానకం, 100 కేజీల పట్టిక 15 లీటర్ల సారా ధ్వంసం చేశారు. మఠంపల్లి మండలంలోని సుల్తాన్పూర్ తండాలో 100 కేజీల పట్టిక, తమ్మారంలో 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. బెట్టెతండా, మంగాపురం తండాల్లో 15 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. సారా బట్టీలు నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు హుజూర్ నగర్ సీఐ భరత్ భూషణ్ తెలిపారు. మఠంపల్లి మండలం వరదాపురంలో తాటిచెట్లు నరికిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు - exice police Attacks On Gudumba Settlements
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆబ్కారీ పోలీసులు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు.
సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు