సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం సజ్జాపురానికి చెందిన మల్లయ్య కుటుంబ దుర్భర జీవితంపై ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో వచ్చిన కథనానికి స్పందన లభించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు మల్లయ్య కుటుంబానికి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మండల తహసీల్దారు సజ్జాపురంలో సర్వే నెంబర్ 23లో ఎకరం పొలం ఇస్తామని హామీ ఇచ్చారు. మల్లయ్య పేరున 20 గుంటలు, జ్యోతి పేరున 20 గుంటలు పట్టా చేయిస్తానన్నారు.
మల్లయ్య కుటుంబానికి దాతల చేయూత - మల్లయ్య కుటుంబం
ఉండటానికి ఇల్లు లేదు. వచ్చిన రోగానికి వైద్యం చేయించుకునే స్థోమత లేదు. ఎటు చూసిన శూన్యమే కన్పిస్తున్న వారి కుటుంబ దుర్భర జీవితంపై ఈనాడు- ఈటీవీ భారత్ ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. మల్లయ్య కుటుంబానికి అన్ని విధాల సాయం చేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకొచ్చారు.
![మల్లయ్య కుటుంబానికి దాతల చేయూత eenadu etv bharat effect on constrict a home for a mallaya family](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6291670-thumbnail-3x2-pppp.jpg)
అధికారులు స్పందించి ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోసి నిర్మాణం మొదలుపెట్టారు. దాతలు స్పందించి ముందుకు వచ్చి తగినంత సహాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం రూ. లక్ష నగదును తహసీల్దార్ ఆధ్వర్యంలో మల్లయ్య కుటుంబానికి అందించారు. ఇంటి నిర్మాణంతో పాటు మరుగుదొడ్డి నిర్మిస్తామని అధికారులు తెలిపారు. మల్లయ్యకు వైద్యం అందించడానికి ప్రభుత్వం తరఫున సహాయం కూడా అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఏ సంక్షేమ పథకం లోనైనా మొదటి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి:మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు