తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమలగిరిలో ఇంటింటి సర్వే - తిరుమలగిరిలో ఇంటింటి సర్వే

రోజురోజుకి జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో అధికారులు కరోనా నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. తిరుమలగిరిలో ఇంటింటి సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

door to door survey in suryapet Tirumala giri
సూర్యాపేటలో ఇంటింటి సర్వే

By

Published : Apr 19, 2020, 6:25 PM IST

Updated : Apr 19, 2020, 8:37 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వరుసగా మూడో పాజిటివ్ కేసు నమోదుతో జిల్లా ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమైంది. పట్టణాన్ని రెండు కంటైన్మెంట్ జోన్లుగా విభజించి, ఎనిమిది టీమ్​లతో ప్రతిరోజు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. కంటైన్మెంట్​లో ఉన్న ప్రతి ఒక్కరికి జియో ట్యాగింగ్ వేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణంలో మొదటి కంటైన్మెంట్​లో 1699 ఇండ్లలో 6553 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి జియోట్యాగింగ్ వేశారు.

తిరుమలగిరిలో ఇంటింటి సర్వే

మున్సిపాలిటీ సిబ్బంది కంటైన్మెంట్​లో ఉన్న ప్రజలకు పాలు, కూరగాయలు, మెడిసిన్​లాంటి నిత్యావసర సరకులు డోర్ డెలివరీ ద్వారా అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు రోడ్లపై బ్లీచింగ్ చల్లుతూ.. శుభ్రత చర్యలు చేపడుతున్నారు. పట్టణంలోని మెడికల్ షాపు యజమానులతో తిరుమలగిరి మున్సిపాలిటీ కమీషనర్ సమావేశం ఏర్పాటు చేసి కరోనా నేపథ్యంలో మందుల కోసం వచ్చే వారి వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి:దీర్ఘకాలంలోనూ కరోనా వైరస్‌ ప్రభావం?

Last Updated : Apr 19, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details