దిల్లీలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారిలో కొంతమందిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గుర్తించారు. పరీక్షల నిమిత్తం వీరిని హైదరాబాద్కు తరలించారు. అధికారుల ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య సిబ్బంది మిర్యాలగూడలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ప్రజల ఆరోగ్య వివరాలు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ పంపిన వారి బంధువుల వివరాలు, వారు ఎవరెవరిని కలిశారు, వారి ఇంటికి వెళ్లిన వివరాలు తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే సర్వే చేపట్టినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
మిర్యాలగూడలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే - coronavirus news
నిజాముద్దీన్ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో మిర్యాలగూడ వాసులు కూడా ఉన్నారని అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇంటింటి సర్వే చేపట్టింది.

మిర్యాలగూడలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే