తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం.. అన్నదాతలకు అపార నష్టం - crop loss due to rain in nalgonda district

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు... ధాన్యం నీటి పాలైంది. గాలి దుమారం, పిడుగుపాట్ల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చేతికందాల్సిన దశలో పంటను కోల్పోయిన అన్నదాతలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

crop loss in nalgonda, crop loss in nalgonda district
నల్గొండలో పంట నష్టం, నల్గొండలో అకాల వర్షం

By

Published : Apr 22, 2021, 10:18 AM IST

పంటనే నమ్ముకున్న రైతుకు మరోసారి దురదృష్టం వెంటాడింది. అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం... అకాల వర్షానికి తడిసి ముద్దయింది. నాలుగు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో... గాలి వానకు చేతికందకుండా పోయి అన్నదాతల్ని తీవ్ర నష్టాల పాలు చేశాయి.

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో గాలి దుమారం, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గుడుగుంట్లపాలెం ఐకేపీ కేంద్రానికి తెచ్చిన ధాన్యం... పనికిరాకుండా పోయింది. కాంటాలు వేసిన 7 వందల బస్తాలు... రాసులు పోసిన మరో 5 వందల సంచులు వర్షార్పణమయ్యాయి. కోదాడ, మునగాల మండలాల్లో అమ్మకానికి తెచ్చిన ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం... వర్షానికి తడిసి ముద్దయింది. కోదాడలో ఉరుములు, మెరుపులతో... మునగాలలో ఈదురుగాలులతో కూడిన వానతో అపార నష్టం సంభవించింది. నడిగూడెం మండలం వేణుగోపాలపురంలో... వర్షానికి కల్లాల్లోని ధాన్యం నీటి పాలైంది. చివ్వెంల మండలం గుంజలూరు, పెన్ పహాడ్ మండలం చీదెళ్లలో రాళ్లు పడ్డాయి.

చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రోళ్లబండ తండాలో... పిడుగుపాటుకు గురై ధరావత్ చంద్రు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పిడుగుపాటుకు చింతపల్లి మండలం బోత్య తండాలో రెండు పశువులు... నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో 18 మేకలు మృత్యువాత పడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details