నల్గొండ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. జిల్లా కేంద్రంలో రోజుకు రోజుకూ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ పాటించాలని వ్యాపార వర్గాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఈనెల 30 నుంచి ఆగస్ట్ 14 వరకు జిల్లాలోని వివిధ వ్యాపారులతో నల్గొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.
ఏకగ్రీవ తీర్మానం...
జిల్లాలోని అన్ని రకాల వ్యాపారస్తులు ఏకగ్రీవంగా తీర్మానించి స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించేందుకు ఒప్పుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కూరగాయల వ్యాపారులు, మొబైల్ షాప్, నెట్ షాపులు మాత్రమే మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంటాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సైదిరెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, వివిధ దుకాణాల యజమానులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : తుది దశకు సచివాలయ భవనాల కూల్చివేత