యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన పగిళ్ల శేఖర్ కరోనా నివారణకు విరామం లేకుండా పని చేస్తున్న వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టులకు, ఇతర రంగాల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రాసి పాడిన పాట ఆకట్టుకుంటున్నది. కరోనా రాకుండా ఏం చేయాలి? కరోనా ఎంతటి ప్రమాదకరమో తెలియజేస్తూ శేఖర్ పాడిన పాట ఆలోచింపజేస్తున్నది.
కరోనాపై ఆలోచింపజేసే పాట పాడిన కళాకారుడు - Corona Awareness Song By Pagilla Shekhar
కవులు, కళాకారులు ప్రజలకు కరోనా మీద అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు భారీగా స్పందన వస్తున్నది. ఇప్పటికే ఎంతోమంది కళాకారులు పాటలు, కవితలు రూపొందించి విడుదల చేశారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మరో కళాకారుడు తన పాటతో ఆలోచింపజేస్తున్నాడు.
కరోనాపై ఆలోచింపజేసే పాట పాడిన కళాకారుడు
TAGGED:
corona song