నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి హాజరయ్యారు. తెరాసకు అనుకూలంగా వ్యవహరించి...కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే తీవ్ర ప్రతిఘటనలు తప్పవని పోలీసులను హెచ్చరించారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులను చేపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా బలపడే అవకాశాలు లేవని.. తెలంగాణకు వారు చేసింది శూన్యమన్నారు. రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలు సంవత్సమంతా నిర్వహిస్తామని తెలిపారు. ముదిగొండలోని తన అమ్మమ్మ ఇంటిని చూసి ఉత్తమ్ బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు .
తెలంగాణకు భాజపా చేసింది శూన్యం: ఉత్తమ్ - congress mp uttam fires on trs and bjp
తెలంగాణకు భాజపా చేసింది శూన్యమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను ఏడాదంతా నిర్వహిస్తామని తెలిపారు.
తెలంగాణకు భాజపా చేసింది శూన్యం: ఉత్తమ్