సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయండి: సీఎం - నాగార్జున సాగర్ ప్రాజెక్టు వార్తలు
12:07 August 01
సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకు సీఎం ఆదేశం
నాగార్జునసాగర్(NagarjunaSagar) జలాశయానికి వరద మరింత పెరిగింది. దీంతో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏఎంఆర్‌పీ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు.. 5 లక్షల 17 వేల 965 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. ఉదయం 5 గంటల వరకు 3 లక్షల 56 వేల 859 క్యూసెక్కులున్న ప్రవాహం.. మరో గంటకే భారీస్థాయిలో పెరిగింది.
జలాశయం 590 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి గాను 579.20 అడుగుల మేర నీకు ఉంది. 312.04 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుదుత్పత్తి ద్వారా 36 వేల 543 క్యూసెక్కులు, ఎస్సెల్బీసీకి 12 వందల క్యూసెక్కులు మొత్తంగా.. 37 వేల 743 క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. నాగార్జునసాగర్ జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నద్ధమవుతున్నారు. ఎన్ఎస్పీ అధికారులు జలాశయం క్రస్ట్ గేట్లను పరిశీలించారు.
ఇవీ చూడండి:NagarjunaSagar: సాయంత్రం తెరుచుకోనున్న నాగార్జునసాగర్ గేట్లు...