తెలంగాణ

telangana

ETV Bharat / city

త్వరలోనే యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్​! - cm kcr in yadadri

వారం రోజుల్లో సీఎం కేసీఆర్​ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారనే సమాచారంతో యాడ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే సీఎం పర్యటనకు సంబంధించి తేదీ ఇంకా ఖరారు కాలేదు. సీఎం పర్యటనకు ముందుగా సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి.. ఈ నెల 29న యాదాద్రిని సందర్శించనున్నారు. ఆరోజే సీఎం పర్యటన తేదీ ఖరారు కానుందని యాడ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలోనే యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్​!
త్వరలోనే యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్​!

By

Published : Aug 26, 2020, 9:20 PM IST

Updated : Aug 26, 2020, 9:25 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, ఆలయ పనులు పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ రానున్నారనే సమాచారంతో యాడ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతేడాది డిసెంబర్ 17న ముఖ్యమంత్రి యాదాద్రిలో పర్యటించారు. తాజాగా ఆలయ పనులు ఏమేరకు జరిగాయో స్వయంగా చూడడానికి మరోమారు గుట్టకు వెళ్లనున్నట్లు సమాచారం.

సీఎం పర్యటనకు సంబంధించి ఇంకా తేదీ ఖరారు కాలేదు. కానీ వారం రోజుల్లో సీఎం పర్యటన ఉండొచ్చని యాడ నిర్వాహకులు భావిస్తున్నారు. సీఎం పర్యటనకు ముందుగా సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి.. వచ్చే శనివారం యాదాద్రిని సందర్శించనున్నారు. ఆరోజే సీఎం పర్యటన తేదీ ఖరారు కానుందని యాడ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రావణ మాసంలోనే సీఎం యాదాద్రి రావాలనుకున్నప్పటికీ.. కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ప్రధానాలయంలో శిల్పాల పనులు తుదిదశకు చేరాయి. దీంతో సీఎం కేసీఆర్ మరోసారి యాదాద్రి ఆలయాన్ని సందర్శించే అవకాశాలున్నాయి. అయితే సీఎం పర్యటనకు సంబంధించి ఆలయ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇవీ చూడండి:మొహర్రం ఊరేగింపునకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరణ: హైకోర్టు

Last Updated : Aug 26, 2020, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details